Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న‌టుడిపై లైంగిక వేధింపులు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిపై కేసు న‌మోదు!

Filmmaker Ranjith Balakrishnan Faces Police Case for Allegedly Sexually Assaulting Man
Advertisement
  • ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్ త‌న‌ను లైంగికంగా వేధించాడంటూ న‌టుడి ఫిర్యాదు
  • మమ్ముట్టి న‌టించిన ఓ మూవీ నిర్మాణ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వెల్ల‌డి
  • ఆడిష‌న్ సాకుతో త‌న‌ దుస్తులు విప్పించి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న న‌టుడు
Advertisement
మాలీవుడ్‌లో మీ టూ ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై జ‌స్టిస్ హేమ క‌మిటీ ఇచ్చిన నివేదిక అనంత‌రం బాధితులు ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు ఎదురైన వేధింపుల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్‌పై కేసు న‌మోదైంది. అయితే, ఆయ‌న‌పై ఫిర్యాదు చేసింది నటి కాదు.. న‌టుడు. త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడంటూ ఆరోపించారాయ‌న‌. దాంతో న‌టుడి ఫిర్యాదు మేరకు పోలీసులు డైరెక్ట‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. 

మమ్ముట్టి న‌టించిన ఓ మూవీ నిర్మాణ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు న‌టుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. "2012 కోజికోడ్‌లో చిత్ర నిర్మాణ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు రంజిత్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఒక రోజు ఆడిష‌న్ సాకుతో న‌న్ను బెంగ‌ళూరులోని కెంపెగౌడ విమానాశ్ర‌య స‌మీపంలోని ఓ హోట‌ల్‌కు ర‌మ్మ‌న్నారు. అనంత‌రం గ‌దిలోకి పిలిచి ఆడిష‌న్‌లో భాగ‌మంటూ నా దుస్తులు విప్పించి నాపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు" అని న‌టుడు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదు మేరకు ద‌ర్శ‌కుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌త‌వారం న‌టుడు ఫిర్యాదు చేయ‌గా, తాజాగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

కాగా, రంజిత్ బాల‌కృష్ణ‌న్‌పై ఇప్ప‌టికే ఓ బెంగాలీ న‌టి ఫిర్యాదు మేర‌కు కోచి పోలీసులు ఓ కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. 2009లో ప‌లేరి మాణిక్యం సినిమా ఆడిష‌న్స్ స‌మ‌యంలో తాను లైంగిక వేధింపుల‌కు ఎదుర్కొన్న‌ట్లు ఆమె ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు బాల‌కృష్ణ‌న్‌పై కేసు న‌మోదు చేశారు. కాగా, ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు.
Advertisement
Advertisement
Ranjith Balakrishnan
Sexually Assaulting Case
Malayalam

More Telugu News